Feb 13, 2025, 07:02 IST/
టీవీకేలో అనుబంధ విభాగాలను ప్రకటించిన విజయ్
Feb 13, 2025, 07:02 IST
తమిళ హీరో విజయ్ మరో కీలక ప్రకటన చేశారు. తన సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(TVK) బలోపేతంలో భాగంగా కొత్తగా 28 అనుబంధ విభాగాలను నియమిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలే లక్ష్యంగా విజయ్ అడుగులు వేస్తున్నాడు. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై ఆయన దృష్టి సారించారు. ఇందులో భాగంగా తాజాగా 28 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేశారు.