మార్స్‌పై కొత్తగా మూడు బిలాలను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ(పీఆర్ఎల్) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్(ఐఏయూ) ఈ క్రేటర్లకు రెండు భారతీయ పట్టణాల పేర్లు పెట్టేందుకు ఆమోదించింది. మార్స్‌పై తూర్పు అంచున ఉన్న క్రేటర్‌కు ఉత్తరప్రదేశ్‌లోని పట్టణం పేరు మీద 'ముర్సన్ క్రేటర్' అని పెట్టారు. పశ్చిమ అంచున ఉన్న బిలానికి బీహార్‌లోని పట్టణం పేరును తీసుకుని 'హిల్సా క్రేటర్'గా నామకరణం చేశారు.