ధన్వాడ పెద్ద చెరువులో రెండు లక్షల చేప పిల్లలను వదిలినారు
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పెద్ద చెరువులో మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు నీరటి నరసింహనాయుడు ఆధ్వర్యంలో శనివారం చెరువులొ చేప పిల్లలు ఇడిసినారు. మొత్తం రెండు లక్షల చేప పిల్లలు చెరువులో వదిలినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నీరటి నరసింహులు నాయుడు, మాజీ కార్యదర్శి నీరటి నారాయణ, మాజీ డైరెక్టర్ ముత్యం రాములు, సంద బాలరాజు, చరణ్, రవి, తదితరులు పాల్గొన్నారు.