ధన్వాడ మండల కేంద్రం కస్తూర్బా పాఠశాలలో రెజ్లింగ్ అకాడమిక్ క్రీడాకారులకు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి 10,000 రూపాయలతో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి దుస్తులను గురువారం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రవీణ్ మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్య క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గంగమ్మ, బిజెవైఎం నాయకులు కురుమూర్తి యాదవ్, చక్రి, జగదీష్ పాల్గొన్నారు.