చంద్రుడిపై మొక్కలు పెంచనున్న నాసా

586చూసినవారు
చంద్రుడిపై మొక్కలు పెంచనున్న నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ చాలా పెద్ద సవాలును స్వీకరించబోతుంది. చంద్రుని ఉపరితలంపై డక్‌వీడ్‌, క్రెస్‌, బ్రాసికా (ఆవ) మొక్కలను పెంచడమే సవాలుగా తీసుకుంది. 2026లో జాబిల్లిపై నాసా నిర్వహించ తలపెట్టిన మూడు ప్రయోగాల్లో ‘లీఫ్‌’ (లూనార్‌ ఎఫెక్ట్స్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ ఫ్లోరా) ఒకటి. చంద్రుని ఉపరితలంపై మొక్కలను పెంచేందుకు నాసా ప్రయత్నించడం ఇదే తొలిసారి.