భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి సత్తా చాటారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న లౌసానే డైమండ్ లీగ్‌లో తన బెస్ట్ త్రో 89.49 మీటర్లు విసిరి 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. 4వ రౌండ్లో 4వ స్థానంలో ఉన్న నీరజ్.. 5వ అటెంప్ట్‌లో 85.58 మీటర్లు, 6వ అటెంప్ట్‌లో 89.49 మీటర్లు విసరడం ద్వారా 2వ ప్లేస్‌కి ఎగబాకారు. ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన గ్రెనడా ఆటగాడు ఆండర్సన్ పీటర్స్ తొలిస్థానంలో నిలిచారు.