నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న NTA నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. తొలుత ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాఖలైంది. 1,563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వాలనే నిర్ణయాన్ని పిటిషన్‌లో సవాలు చేశారు. NTAపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి పేరు కార్తీక్. తన పిటిషన్‌లో ముందస్తు విచారణ కోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రీని అభ్యర్థించాడు.