పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరో సంచలనం సృష్టించారు. రొనాల్డో తన ఫ్యాన్స్‌కి అందుబాటులో ఉండేందుకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించగా, కేవలం గంటన్నరలోనే 10 లక్షల సబ్‌స్రైబర్లను సాధించిన తొలి వ్యక్తి రికార్డు సృష్టించారు. ప్రారంభించిన సగం రోజులోనే ఆ సంఖ్య కోటి దాటేసింది. ఇక ఛానల్‌లో 19 వీడియోలను పోస్టు చేశారు.