ఉత్తుత్తి ఆఫర్లతో వల

55చూసినవారు
ఉత్తుత్తి ఆఫర్లతో వల
కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లు ఒక నెలపాటు ఉచితంగా సబ్‌స్క్రైబ్‌ చేసుకోండని ఆఫర్లు ఇస్తాయి. క్రెడిట్, డెబిట్‌ కార్డుల వివరాలు అడుగుతాయి. సమాచారం ఇచ్చిన తరవాత వాటిని రద్దుచేసుకునే ఆప్షన్స్‌ కనిపించకుండా చేస్తాయి. కష్టమర్‌ కేర్‌కు ఫోన్‌చేసినా సరైన స్పందన ఉండదు. సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకునే లోపే బ్యాంకు ఖాతా నుంచి రుసుము కట్‌ అయిపోతుంది! యువత ఎక్కువగా ఉపయోగించే మ్యూజిక్, వీడియో ఎడిటింగ్, గేమింగ్‌ యాప్‌లకు ఈ దందా బాగా అలవాటు.

సంబంధిత పోస్ట్