ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్‌.. ఇకపై ఆ కాల్స్‌కి చెక్‌

69చూసినవారు
ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్‌.. ఇకపై ఆ కాల్స్‌కి చెక్‌
ట్రూకాలర్‌ సంస్థ కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. ఏఐ సాయంతో చేసే కాల్స్‌ను గుర్తించేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఏదైనా కాల్‌ వచ్చినప్పుడు ఆ వాయిస్ ఏఐ సాయంతో జనరేట్‌ చేసినదా? కాదా? అనేది కొన్ని క్షణాల్లో ట్రూకాలర్‌ ఈ ఫీచర్‌ చెప్పేస్తుంది. కొన్ని క్షణాల పాటు ఆ వాయిస్‌ను రికార్డు చేసి అనలైజ్‌ చేస్తుంది. ఇందుకోసం తమ సొంత ఏఐ మోడల్‌ను వినియోగించినట్లు ట్రూకాలర్‌ తెలిపింది.