'Rafah' పోస్టర్‌ 44M ఇన్‌స్టా అకౌంట్లలో షేర్

79చూసినవారు
'Rafah' పోస్టర్‌ 44M ఇన్‌స్టా అకౌంట్లలో షేర్
గాజాలోని రఫా సిటీపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను ఖండిస్తూ 'All Eyes On Rafah' పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆ ఫొటో సోమవారం నుంచి ఇప్పటి వరకు 44 మిలియన్ల ఇన్‌స్టా అకౌంట్లలో షేర్ అయ్యింది. అలాగే ఎక్స్‌లో 3 రోజుల్లోనే రఫాకు సంబంధించి 27.5 మిలియన్ల మెసేజ్‌లు పబ్లిష్ అయ్యాయి. పాలస్తీనీయుల శరణార్థి శిబిరంపై ఆదివారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 45 మంది అమాయకులు చనిపోగా, 249 మంది గాయపడిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్