అరుదైన బ్లడ్ గ్రూప్.. రక్తదానం చేసేందుకు 440 KM ప్రయాణం

71చూసినవారు
అరుదైన బ్లడ్ గ్రూప్.. రక్తదానం చేసేందుకు 440 KM ప్రయాణం
షిర్డీలోని పూల వ్యాపారి రవీంద్ర అష్టేకర్ (36) పెద్ద మనసు చాటుకున్నాడు. అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ గల ఓ మహిళ ఇండోర్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని వాట్సాప్‌లో తెలుసుకున్నాడు. ఇదే గ్రూప్ రక్తం గల రవీంద్ర సొంత ఖర్చుతో 440KM ప్రయాణించి రక్తదానం చేశాడు. ఇలా గతంలోనూ ఆయన పలువురి ప్రాణాలు కాపాడాడు. దేశంలో 179 మందికి మాత్రమే ఈ రకం బ్లడ్ ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ఇది బ్లడ్ బ్యాంకుల్లోనూ దొరకదు.

ట్యాగ్స్ :