అంతరిక్షంలోకి భారత్‌ సరికొత్త ‘అగ్నిబాణ్‌’

66చూసినవారు
అంతరిక్షంలోకి భారత్‌ సరికొత్త ‘అగ్నిబాణ్‌’
భారత్‌లోని తొలి ప్రైవేటు స్పేస్‌ లాంచ్‌ ప్యాడ్‌ నుంచి అగ్నిబాణ్‌ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. శ్రీహరి కోటలోని స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లింది. సాంకేతిక లోపాలు తలెత్తడంతో నాలుగుసార్లు ఈ ప్రయోగాన్ని నిలిపివేశారు. ఐదవ ప్రయత్నంలో అగ్నిబాణ్‌ను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఈ రాకెట్ ను రూపొందించింది.