మరోసారి కిమ్ కవ్వింపు చర్యలు

53చూసినవారు
మరోసారి కిమ్ కవ్వింపు చర్యలు
ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జపాన్ సముద్రం మీదుగా ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ సైన్యాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 10 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను గుర్తించామని, వీటి పరిధి సుమారు 350 కిలోమీటర్లు ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో పసిఫిక్ మహాసముద్రంలో నిఘాను మరింత పెంచినట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్