హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాకు కొత్త విమాన సర్వీసులను ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రారంభించింది. సౌదీలోని మదీనాకు డైరెక్ట్ విమాన సర్వీసులను నడపనుంది. ఈ క్రమంలో తొలి ఫ్లైట్‌ను ఫిబ్రవరి 21న లాంఛనంగా ప్రారంభించింది. కాగా ఈ సర్వీసులు వారానికి మూడు రోజులు అంటే.. సోమ, గురు, శనివారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.