జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్

70చూసినవారు
జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్
ప్రముఖ టెలికాం సంస్థ అయిన జియో‌ కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. వాయిస్‌, ఎస్ఎమ్ఎస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జియో.. వాయిస్‌ ఓన్లీ పేరిట రూ. 458 రీఛార్జితో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌, 1000 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి.