కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్’ (NFBS) అమలుచేస్తోంది. ఈ పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువున ఉండి, తెల్లరేషన్ కార్డు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు. దీనికోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుని మీ మండల రెవెన్యూ అధికారికి సమర్పించాలి.