Oct 18, 2024, 16:10 IST/
బెంగాలీ సీనియర్ నటుడు దేబ్రాజ్ రాయ్ కన్నుమూత
Oct 18, 2024, 16:10 IST
ప్రముఖ బెంగాలీ నటుడు దేబ్రాజ్ రాయ్ ( 69) కన్నుమూశారు. మూత్ర పిండాల సమస్యతో బాధపడుతూ కోల్కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన ప్రతిద్వాండి (1970)లో సినీ రంగ ప్రవేశం చేసిన దేబ్రాజ్ అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. దేబ్రాజ్ రాయ్ మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.