యూట్యూబర్ హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిగ్ బాస్ ఫేమ్, RJ శేఖర్ బాషాను సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు గంటలుగా సైబర్ క్రైమ్ కార్యాలయంలో శేఖర్ బాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని హర్ష సాయి బాధితురాలు శేఖర్ బాషాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.