ఆంక్షలతో అగమ్య గోచరం

54చూసినవారు
ఆంక్షలతో అగమ్య గోచరం
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలు, వ్యాపారులు అభయారణ్య ఆంక్షలతో ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గం పూర్తిగా కవ్వాల్ అభయారణ్య పరిధిలోనే ఉంది. అయితే అభయారణ్య, వన్యప్రాణుల రక్షణకు ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో భారీ వాహనాలకు అనుమతి రాకపోవడం, స్థానిక యువతకు ఉపాధి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమకు ఒక పరిష్కారం చూపించి ఆదుకోవాలని ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్