బిఆర్ఎస్ నాయకుల ముమ్మర ప్రచారం

77చూసినవారు
బిఆర్ఎస్ నాయకుల ముమ్మర ప్రచారం
దస్తురాబాద్ మండలంలోని గోడిసెరాల గ్రామంలో శనివారం బిఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోరుతూ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు వారు ఆ గ్రామ శివారులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఎంపీ ఎన్నికలలో ఆత్రం సక్కును గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జానకి రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్