విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి

57చూసినవారు
జన్నారం పట్టణంలోని రామ్ నగర్ లో ఉన్న కొత్త కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. సోమవారం వారు మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం ఇళ్ళను నిర్మించుకున్నామని విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో కట్టెలకు వైర్లు బిగించి విద్యుత్ సరఫరా చేసుకుంటున్నామని తెలిపారు. తరచూ వస్తున్న ఈదురు గాలులకు కట్టెలు పడిపోతున్నాయని వారు వాపోయారు. అధికారులు స్పందించి తమ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్