హ్యాట్సాఫ్ కిరణ్

59చూసినవారు
హ్యాట్సాఫ్ కిరణ్
ఉట్నూర్ పట్టణానికి చెందిన బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు కిరణ్ 30వ సారి రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో పాకాల విజయ అనే మహిళ ప్రసవించింది. అయితే ఆ మహిళకు అత్యవసరంగా రక్తం కావాలని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న బొడ్డు కిరణ్ ఉట్నూర్ నుండి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ రక్త దానం చేశారు. దీంతో కిరణ్ ను ఆస్పత్రి వైద్యులు అభినందించారు.

సంబంధిత పోస్ట్