జన్నారం మండలం ఇంధన్ పల్లి అటవీ డివిజన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు శుక్రవారం ఇందన్పల్లి ఎస్ఆర్ఏ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా వాగులో నుంచి ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మొర్రిగూడ వాగులో ఇసుక నింపుతున్న ఒక ట్రాక్టర్, ధర్మారం వైపు వెళ్తున్న మరో ట్రాక్టర్ ను పట్టుకొని, సీజ్ చేశామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవన్నారు.