ఖానాపూర్: ఒకరిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు

60చూసినవారు
ఖానాపూర్: ఒకరిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు
ఖానాపూర్, పెంబి మండలాల్లో దాడులు నిర్వహించి ఒకరిని అరెస్టు చేశామని ఎక్సైజ్ ఎస్ఐ వసంతరావు తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్ ఆదేశాల మేరకు పెంబి, ఖానాపూర్ మండలాల్లోని పెంబి తండా, ఇటిక్యాల, ఇటిక్యాల తండా, సేవనాయక్ తండా గ్రామాల్లో శుక్రవారం సంయుక్త దాడులు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా 2 కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేసి వారి నుంచి 5 లీటర్ల నాటుసారా, 320 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్