ఘనంగా రంజాన్ పండుగ

67చూసినవారు
ఘనంగా రంజాన్ పండుగ
ఖానాపూర్ మండలంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. రంజాన్ సందర్భంగా గురువారం ఖానాపూర్ పట్టణంతో పాటు ఆ మండలంలోని పలు గ్రామాల శివార్లలో ఉన్న ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బొజ్జు, బిఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు జాన్సన్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :