తైవాన్ పార్లమెంట్‌లో ఎంపీల కొట్లాట.. వీడియో వైరల్

53చూసినవారు
తైవాన్ పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర దాడికి దిగారు. పార్లమెంట్‌లో సంస్కరణలకు సంబంధించి శుక్రవారం సభలో ఓ బిల్లును ప్రతిపాదించారు. పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు ఇచ్చే సభ్యులపై నేరాభియోగాలు మోపేలా బిల్లులో ప్రతిపాదనలు చేయడాన్ని
విపక్షాలు వ్యతిరేకించాయి. ఈక్రమంలో దీనిపై చర్చ జరుపుతుండగా ఎంపీలు గొడవకు దిగి ఒకరినొకరు తోసుకున్నారు. ఈ దృశ్యాలు తైవాన్ మీడియాలో ప్రసారమవ్వగా వైరల్‌గా మారాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్