వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

72చూసినవారు
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల అధ్యక్షులు ముజఫర్ ఖాన్ ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన జన్నారం మండలంలోని తపాలాపూర్, సింగరాయిపెట్, రాంపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్