ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

74చూసినవారు
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జన్నారం మండలంలోని తపాలాపూర్ గ్రామ జడ్పీ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం తపాలాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు పెంపొందించారన్నారు. చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you