నీటి సమస్యకు పరిష్కారం

69చూసినవారు
నీటి సమస్యకు పరిష్కారం
దస్తురాబాద్ మండలంలోని పెర్కపల్లి గ్రామంలో ఉన్న పోచమ్మ ఆలయం సమీపంలో బోరును వేసి ఎమ్మెల్యే బొజ్జు నీటి సమస్యను తీర్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామంలో బోర్వెల్ వేయిస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ఆ దేవాలయం ఆవరణలో నూతన బోర్వెల్ ను వేసి గ్రామస్తుల కోరికను తీర్చారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :