ఆడిటింగ్ కోసం గ్రామ రికార్డుల సమర్పణ

82చూసినవారు
ఆడిటింగ్ కోసం గ్రామ రికార్డుల సమర్పణ
జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల ఆడిటింగ్ కోసం గ్రామ రికార్డులను ఆడిటింగ్ అధికారులకు గ్రామ పంచాయతీ సిబ్బంది సమర్పిస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి హామీ పనులపై గ్రామస్థాయిలో సోషల్ ఆడిటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆడిట్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది నుండి రికార్డులను స్వాధీనం చేసుకుంటూ బుధవారం నుండి గ్రామస్థాయిలో సోషల్ ఆడిట్ చేసేందుకు సిద్ధమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్