ఏజెన్సీ చట్టాలను సవరించాలి

80చూసినవారు
ఏజెన్సీ చట్టాలను సవరించాలి
ఏజెన్సీ చట్టాలకు సవరణ చేయాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోల రాజమల్లు కోరారు. ఆ ఐక్యవేదిక సోమవారం సాయంత్రం ఖానాపూర్ పట్టణంలో సమావేశం నిర్వహించారు. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితులపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపి ఎస్సీ ఎస్టీలకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ ఐక్యవేదిక నాయకులు, పలువురు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్