గోదావరి నది జలాలను సేకరించేందుకు బయలుదేరిన మెస్రం వంశీయులు

69చూసినవారు
నాగోబా జాతరకు అవసరమయ్యే గోదావరి నది జలాలను సేకరించేందుకు వస్తున్న మెస్రం వంశీయులు బుధవారం ఉట్నూర్ మండలంలోని దంతన్ పల్లి నుంచి బయలుదేరారు. నాగోబా జాతరకు గోదావరి జలాలతో అంకురార్పణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో కేస్లాపూర్ నుంచి బయలుదేరిన మెస్రం వంశీయులు బుధవారం ఉదయం బీర్సాయిపేట్ మార్గంలో పాదయాత్రగా వస్తున్నారు. జన్నారం మండలంలోని కలమడుగు శివారులో ఉన్న గోదావరి నది జలాలను సేకరించి తిరుగు పయనమవుతారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you