వృక్షం పడిపోవడంతో నిలిచిపోయిన రాకపోకలు

85చూసినవారు
ఉట్నూరు మండలంలోని కోలాం గూడా గ్రామ ప్రధాన రహదారిపై చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉట్నూరు మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల ప్రభావంతో కొలాం గూడా గ్రామ శివారులో ఉన్న ప్రధాన రహదారిపై చెట్టు పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ రిమ్స్ కు అత్యవసర చికిత్స నిమిత్తం వెళ్లే అంబులెన్స్ రావడంతో గ్రామస్తులు సహాయం చేశారు.

ట్యాగ్స్ :