పోడు భూముల పట్టాలు ఇవ్వాలి

59చూసినవారు
జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో అటవీ భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసి, గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆశన్న, మండల కార్యదర్శి కనికారపు అశోక్ కోరారు. మంగళవారం జన్నారం మండలంలోని దేవునిగూడెం గ్రామంలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసి, గిరిజన రైతులు సాగు చేస్తున్న పోడు భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్