రేపు లోకేశ్వరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే పర్యటన
ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సోమవారం లోకేశ్వరం మండల కేంద్రంలో పర్యటించానున్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉదయం 12: 30 గంటలకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారని ముధోల్ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ సుమన్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమానికి లబ్ధిదారులు బిజెపి నాయకులు హాజరు కావాలని కోరారు.