పిడుగు పాటుకు ఎద్దులు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి లోకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయపూర్ కండ్లి రైతు లింగురాం ఆరుబయట కట్టి ఉంచిన ఎద్దులపై ఎద్దులపై రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన భారీగా కురిసిన వర్షానికి పిడుగు పడడంతో రెండు ఎద్దులు, ఒక లేగ దూడ అక్కడ కక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.