తానూర్ మండల కేంద్రంలోని హంగీర్గ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం నుండి ఎరువులు అందుబాటులో ఉన్నాయని పీఏసీఎస్ చెర్మెన్ నారాయణ రావు పటేల్ ప్రకటనలో పేర్కొన్నారు. బస్తా యూరియా రూ. 267, నానో యూరియా రూ. 220, బస్తా డీఏపీ రూ. 1350 ఉందని పేర్కొన్నారు. కావలసిన రైతులు వారి ఆధార్ కార్డు జిరాక్స్ కార్యాలయానికి వచ్చి ఎరువులు తీసుకెళ్లాలని ఆయన కోరారు.