మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే

80చూసినవారు
బాసర మండలం బిద్రేల్లి గ్రామ సమీపంలోసోమవారం భైంసా వైపు నుండి వస్తున్న బైక్ కు ఎదురుగా వచ్చిన ఆటో బైక్ ఢీ కొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ తన కారు ను అపి గాయపడిన వ్యక్తికి మాట్లాడి ఆయనకు దైర్యం కల్పించారు. 108కు ఫోన్ చేసి దగ్గరుండి భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లకు ఫోన్ లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్