నీటి సమస్యతో అవస్థలు పడుతున్న ప్రజలు

85చూసినవారు
కుబీర్ మండలం పల్సి గ్రామంలో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో ఎనిమిది బోరు బావులు ఉన్నప్పటికీ అందులో ఒక్క బోరు బావి మాత్రమే పనిచేస్తుందని అన్నారు. బిందెడు నీరు కావాలంటే గంటలు తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు అధికారులకు మోర పెట్టుకున్న పట్టించుకోవడంలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్