తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్స్ ను మంగళవారం సెక్రటరీ ఆదేశాలతో తొలగించారు. తమను తిరిగి తీసుకోవాలని బుధవారం ముధోల్ లో ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి కి వినతిపత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్ట్ టైం అన్న పేరుతో రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా అంకితభావంతో పని చేస్తున్నామన్నారు. మాపైన ఎలాంటి ఆరోపణ లేనప్పటికీ ఎటువంటి కారణం చూపకుండా తొలగించడం బాధాకరమని అన్నారు.