విద్యుత్ తీగలపై పడ్డ చెట్టుకొమ్మ.. స్పందించిన లైన్మెన్

73చూసినవారు
లోకేశ్వరం మండలం రాజుర గ్రామంలో ఆదివారం సాయంత్రం సింగిల్ ఫేస్ విద్యుత్ తీగల పై ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మ విరిగిపడి మంటలు చేలరేగాయి. ప్రమాదం గురించి లైన్మెన్ గజానంద్ రెడ్డికి సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి సిబ్బందితో చెట్లకొమ్మలు తీసివేయించారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన లైన్ మెన్, సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్