నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని భైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. శనివారం తానూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు అందించారు. నేరాలు జరగకుండా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ముధోల్ సిఐ మల్లేష్ ఎస్ఐ రమేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.