గజ్జలమ్మదేవికి ప్రత్యేక పూజలు

80చూసినవారు
కుంటాల మండల కేంద్రంలోని గజ్జలమ్మదేవి ఆలయంలో ఆదివారం గురుస్వామి గజేందర్, ఆధ్వర్యంలో గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మ వార్లను దర్శించుకున్నారు. పూజలు చేసి నైవే ద్యాలు సమర్పించారు. పలువురు ఎత్తు బం గారం (బెల్లం), తలనీలాలు ఇచ్చి మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :