కన్నుల పండువగా ఊరు పండుగ

64చూసినవారు
ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో మంగళవారం ఊరు పండుగను గ్రామస్తులు ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు. పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయబద్ధంగా గ్రామస్తులు గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంటలు బాగాపండి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you