ప్రసూతి ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి

62చూసినవారు
ప్రసూతి ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి
ప్రసూతి ఆసుపత్రిలో మహిళలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం జిల్లా ప్రసూతి పిల్లల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ శస్త్ర చికిత్సలను తగ్గించి, సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్