నిర్మల్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు శివారు కాలనీలు జలమయమయ్యాయి. సోమవారం డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ,అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి పర్యటించారు. ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం సిద్దాపురం వాగును పరిశీలించారు