ప్రమాదవశాత్తు చెరువులో పడి మేకల కాపరి మృతి
ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మేకల కాపరి మృతి చెందిన ఘటన తానూరు మండలంలో బుధవారం జరిగింది. ఎస్ఐ సందీప్, కుటుంబ సభ్యుల వివరాల మేరకు తానూర్ మండల కేంద్రానికి చెందిన యాసిన్ ఖాన్(19) మేకలను కాస్తూ ప్రమాదవశాత్తు మండలంలోని సింగన్గావ్ గ్రామ చెరువులో పడి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.