పేజర్ పేలుళ్లు జరిగిన ఒక రోజు తర్వాత లెబనాన్‌లో పేలిన వాకీ టాకీలు

56చూసినవారు
పేజర్ పేలుళ్లు జరిగిన ఒక రోజు తర్వాత లెబనాన్‌లో పేలిన వాకీ టాకీలు
లెబనాన్‌లో మరోసారి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. పేజర్లు పేలి దేశంలో సుమారు 3,000 మంది గాయపడ్డ ఒక రోజు తర్వాత హెజ్‌బొల్లా ఉపయోగించిన వాకీ టాకీలు లెబనాన్ లోని బీరూట్‌లో పేలాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. పేజర్లు పేలి మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించే చోటుకు సమీపంలో వాకీ టాకీల పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. పేజర్ పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగింది.

సంబంధిత పోస్ట్