జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అమిత్ షాకు తప్ప ఎవరికీ బహుళ ఎన్నికలపై సమస్యలు లేవని పేర్కొన్నారు. ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.